Skip to main content

Namaste NRI

యూత్ ఫుల్ కంటెంట్ తో..వాట్స్‌ ఆప్‌ నరేష్‌ గ్లింప్స్‌ విడుదల

అన్వేష్‌ మైఖేల్‌, కావ్య కళ్యాణ్‌రామ్‌ జంటగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ వాట్స్‌ ఆప్‌ నరేష్‌. సి.వి.విశాల్‌ దర్శకుడు. భాగ్యలక్ష్మీ చింత నిర్మాత. నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం త్వరలో విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఎనిమిదికోట్లు కట్నంగా ఇస్తే, ఎన్ని కాలాలైనా వెయిట్‌ చేస్తా అనే డైలాగ్‌తో హీరో పాత్రను పరిచయం చేస్తూ గ్లింప్స్‌ మొదలైంది. చివర్లో హీరోయిన్‌ పాత్ర పరిచయం కూడా ఫ్రెష్‌గా అనిపించింది.


గింప్స్‌ నేపథ్యంలో లోకం తీరింతే.. నువ్వే మారాలంతే.. లొల్లె ఒద్దంటే.. తెలివిని కప్పెట్టంతే అంటూ వినిపిస్తున్న పాట చిత్ర కథా నేపథ్యాన్ని ఆవిష్కరిస్తూవుంది. సాఫ్ట్‌వేర్‌ లైఫ్‌, ప్రేమ, కుటుంబం ఇలా అన్నిరకాల అంశాల మేళవింపుగా ఈ సినిమా రూపొందిందని గ్లింప్స్‌ చెబుతున్నది. ఈ నెల 14న ప్రేమికుల రోజు సందర్భంగా రెండో గ్లింప్స్‌ని విడుదల చేయనున్నట్టు మేకర్స్‌ తెలిపారు. కె.సాయిసంతోష్‌, ఉషశ్రీ మురళి, సంతోష్‌ నందివాడ, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వేదరామన్‌ శంకరన్‌, సంగీతం: స్మరణ్‌సాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events