Skip to main content

Namaste NRI

ఘనంగా యూఎస్ మెరైన్ కార్ప్స్ వార్సికోత్సవం

అమెరికా మెరైన్‌ కార్ప్స్‌ 246వ వార్షికోత్సవాలు  హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌లో ఘనంగా నిర్వహించారు. యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ జోయల్‌ రీఫ్‌మ్యాన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఇండియన్‌ నేవీ ఈస్ట్రన్‌ ఫ్లీట్‌ ఫ్లాగ్‌ రేర్‌ అడ్మిరల్‌ తరుణ్‌ సోబతి హాజరయ్యారు. హైదరాబాద్‌ కార్యాలయంలో తొలిసారి ఈ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని రీఫ్‌మ్యాన్‌ అన్నారు. భారత నేవీ అధికారి హాజరుకావడం ఇరుదేశాల మధ్య సత్సంబంధాలను సూచిస్తోందని పేర్కొన్నారు.  181 దేశాల్లో ఉన్న అమెరికన్‌ కాన్సులేట్‌ కార్యాలయాలకు యూఎస్‌ మెరైన్‌ కార్ప్స్‌ రక్షణ సేవలు అందిస్తారు.

Social Share Spread Message

Latest News