Namaste NRI

సంగీత్ శోభన్ హీరోగా రాకాస టీజర్ రిలీజ్

సంగీత్‌ శోభన్‌, నయన్‌ సారిక జంటగా నటించిన చిత్రం రాకాస. ఈ హారర్‌ కామెడీ మూవీకి మానసశర్మ డైరెక్టర్‌. ఉమేష్‌ కుమార్‌ బన్సాల్‌తో కలిసి నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 3న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్‌ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. నరకం నుండి సందేశం వస్తుంది.. ఇక సమయం లేదు.. మన ఊరి శాపమిది.. మన పూర్వీకులు ఎంచుకున్న తలరాత.. అంటూ ఊరిని, ఊరి జనాన్నీ పరిచయం చేస్తూ వదిలిన ఈ టీజర్‌ ఆసక్తికరంగా ఉన్నది.

శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం.. శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం.. ఈ రెండు లైన్లే వస్తున్నాయేంటి? అంటూ భయపడుతూ వణికిపోతూ సంగీత్‌ శోభన్‌ టీజర్‌లో ఎంట్రీ ఇచ్చి అందర్నీ నవ్వించారు. ఆయన ఎంట్రీతో టీజర్‌ పూర్తిగా కామెడీ జానర్లోకి మారిపోయింది. విజువల్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌, నేపథ్య సంగీతం నెక్ట్స్‌ లెవల్లో ఉన్నాయి. చివర్లో హీరో భయపడుతూ ఓస్త్రీ రేపురా.. అనే డైలాగ్‌ నవ్వుల్ని పూయించింది. ఈ చిత్రానికి కెమెరా: రాజు ఎదురోలు, సంగీతం: అనుదీప్‌ దేవ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events