Namaste NRI

109 సెంటర్లలో హాఫ్‌ సెంచరీ .. మన శంకర వరప్రసాద్

ఈ రోజుల్లో ఓ సినిమా 50రోజుల పాటు థియేటర్‌లో ప్రదర్శింపబడటం చాలా అరుదైన విషయం. తాజాగా ఈ ఫీట్‌ని సాధించింది మెగాస్టార్‌ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్‌ గారు సినిమా. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 109 కేంద్రాల్లో విజయవంతంగా అర్థ శతదినోత్సవాన్ని పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్రబృందం వెల్లడించింది. ప్రస్తుతం మన శంకరవరప్రసాద్‌ గారు ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్న విషయం తెలిసిందే.

ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 400 కోట్లకుపైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. ఓవర్‌సీస్‌లో కూడా వసూళ్ల పరంగా సత్తా చాటింది. చిరంజీవి వింటేజ్‌ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌, ప్రత్యేక పాత్రలో అగ్ర నటుడు వెంకటేష్‌ చేసిన సందడి ఈ సినిమా అద్భుత విజయంలో కీలకభూమిక పోషించాయి. షైన్‌స్క్రీన్‌, గోల్డ్‌బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events