Namaste NRI

రామ్ చరణ్ పెద్ది మూవీ నుంచి రెండో సాంగ్ వచ్చేసింది

అగ్ర హీరో రామ్‌చరణ్‌ నటిస్తున్న పానిండియా మాస్‌ ఎంటర్‌టైనర్‌ పెద్ది. జాన్వీ కపూర్‌ కథానాయిక. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి రెండో పాటను మేకర్స్‌ విడుదల చేశారు. రై రై రారా.. రై రై రారా.. అడ్డే లేని దారై రారా.. రై రై రారా.. రై రై రారా.. హద్దే లేని తీరై రారా అంటూ సాగే ఈ పాటను అనంతశ్రీరామ్‌ రాయగా, ఏ.ఆర్‌.రెహ్మాన్‌ స్వరపరిచి, స్వయంగా ఆలపించారు. క్యాచీగా, జనబాహుళ్యంలోకి త్వరగా వెళ్లేలా, శ్రోతల్ని అలరించేలా ఈ మాస్‌ నంబర్‌ సాగింది.

కథానాయకుని పరిచయగీతం ఎలా ఉండాలో ఓ కొత్త బెంచ్‌మార్క్‌ని సెట్‌ చేస్తూ, ఈ గీతాన్ని రూపొందించారు దర్శకుడు బుచ్చిబాబు సానా. రామ్‌చరణ్‌ తన మాస్‌ ఎనర్జీతో కూడిన గ్రేస్‌తో ఈ పాటలో స్టెప్పులు అదరగొట్టారు. జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ ఈ పాటకు హైలైట్‌. ఏప్రిల్‌ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కెమెరా: ఆర్‌.రత్నవేలు, నిర్మాత: వెంకటసతీష్‌ కిలారు, సమర్పణ: మైత్రీ మూవీమేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌, నిర్మాణం: వృద్ధి సినిమాస్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events