Namaste NRI

ఘ‌నంగా అల్లు శిరీష్ వివాహం

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు, హీరో అల్లు శిరీష్ తన ప్రేయసి నయనికతో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఈ పెళ్లి వేడుక హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. నగరంలోని కొల్లూరు ప్రాంతంలోని ఐనా ఈవెంట్ స్పేస్‌లో జరిగిన ఈ వివాహానికి ఇరు కుటుంబాల సభ్యులు, బంధువులు, సన్నిహితులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వేడుకకు ప్రత్యేకంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి కూడా పెళ్లికి హాజరై ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి వధూవరులకు పుష్పగుచ్ఛం అందించి ఆశీర్వాదాలు తెలిపారు. అనంతరం వధూవరులతో పాటు అల్లు అరవింద్, అల్లు అర్జున్‌లతో కలిసి ఫోటోలు దిగారు.

Social Share Spread Message

Latest News