Namaste NRI

జాన్వీ కపూర్ బర్త్ డే స్పెషల్.. పెద్ది నుంచి పోస్టర్‌ రిలీజ్

రామ్‌చరణ్‌ హీరోగా నటించిన చిత్రం పెద్ది. ఈ సందర్భంగా ప్రమోషన్లు వేగవంతం చేశారు. జాన్వీ కపూర్‌ ఇందులో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా పెద్ది లోని ఆమె పాత్రను పరిచయం చేస్తూ స్పెషల్‌ పోస్టర్‌ని, బర్త్‌డే ట్రిబ్యూట్‌ వీడియోను మేకర్స్‌ విడుదల చేశారు. మెరూన్‌ కలర్‌ ఎంబ్రయిడరీ బ్లౌజ్‌, మ్యాచింగ్‌ లెహంగా ధరించి ైస్టెలిష్‌గా కనిపిస్తున్న జాన్వీకపూర్‌ని ఈ పోస్టర్‌లో చూడొచ్చు.
అచ్చియమ్మ అనే పల్లెటూరి అమ్మాయిగా ఇందులో జాన్వీ కనిపించనున్నది. ఇక వీడియోలో వింటేజ్‌ మైక్‌ ముందు పాట పాడుతూ జాన్వీకపూర్‌ కనిపించింది. శివరాజ్‌కుమార్‌, జగపతిబాబు, దివ్యేందుశర్మ, బోమన్‌ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా వచ్చే నెల 30న విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: ఆర్‌.రత్నవేల్‌, సంగీతం: ఏ.ఆర్‌.రెహమాన్‌, దర్శకత్వం: బుచ్చిబాబు సాన, నిర్మాత: వెంకటసతీష్‌ కిలారు, సమర్పణ: మైత్రీ మూవీమేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌, నిర్మాణం: వృద్ధి సినిమాస్‌.


Social Share Spread Message

Latest News