Namaste NRI

ఇరాన్‌ సుప్రీం లీడర్‌గా మొజ్తబా ఖమేనీ

అయతుల్లా అలీ ఖమేనీ మృతి నేపథ్యంలో ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌గా ఆయన రెండో కుమారుడు మొజ్తబా ఖమేనీ ఖరారయ్యారు. ఈ మేరకు ఇరాన్‌ అధికారికంగా ప్రకటించింది. మొజ్తబా సుప్రీంగా ఖరారు కాగానే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అభినందనలు తెలిపారు. ఇజ్రాయెల్‌-అమెరికా యుద్ధంలో ఇరాన్‌కు మద్దతునిస్తూ అండగా ఉంటామని హామీనిచ్చారు. మరోవైపు, టెహ్రాన్‌లో ప్రజలు ఇజ్రాయెల్‌, అమెరికా దాడులకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. మొజ్తబా ఖమేనీకి అనుకూలంగా నినాదాలు చేశారు.

Social Share Spread Message

Latest News