Namaste NRI

అక్షయ్ కుమార్ భూత్ బంగ్లా టీజర్ విడుద‌ల

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, దర్శకుడు ప్రియదర్శన్ కాంబినేషన్‌లో వ‌స్తున్న మోస్ట్ అవైటెడ్ హారర్-కామెడీ చిత్రం భూత్ బంగ్లా. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ను విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన భూల్ భులైయా వంటి క్లాసిక్ సినిమాను గుర్తు చేస్తూ, భయం మరియు నవ్వుల మేళవింపుతో ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మంగళపూర్ అనే గ్రామంలోని వధుసురుడు అనే మిస్టరీ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని టీజర్ ద్వారా చిత్ర బృందం స్పష్టం చేసింది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్‌తో పాటు టబు, పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్, వామిఖ గబ్బి, మిథిలా పాల్కర్ వంటి భారీ తారాగణం నటిస్తుండగా, ప్రీతమ్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న వ‌రల్డ్ వైడ్‌గా విడుద‌ల కాబోతుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events