Namaste NRI

సుడిగాలి సుధీర్‌ గోట్ సెన్సార్‌ పూర్తి

హీరో సుడిగాలి సుధీర్‌ నటించిన చిత్రం G.O.A.T.(గోట్) Greatest Of All Times అనేది ఉపశీర్షిక. దివ్యభారతి కథానాయిక. వేదవ్యాస్‌ దర్శకుడు. చంద్రశేఖర్‌రెడ్డి మొగుళ్ల నిర్మాత. తాజాగా సెన్సార్‌వారు ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికెట్‌ అందించారు. ఈ నెల 26న సినిమా థియేట్రికల్‌ రిలీజ్‌ కానుంది.

ఖర్చు విషయంలో రాజీ పడకుండా రిచ్‌గా సినిమా నిర్మించామని, సుధీర్‌ కెరీర్‌కి ఈ సినిమా మైలురాయిలా నిలుస్తుందని, పూర్తి కమర్షియల్‌ అంశాలతో రూపొందిన ఈ సినిమా యువతకు బాగా నచ్చుతుందని నిర్మాత తెలిపారు. సర్వదమన్‌ బెనర్జీ, బ్రహ్మాజీ, పృథ్వీ, చమ్మక్‌చంద్ర, తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కెమెరా: రసూల్‌ ఎల్లోర్‌, సంగీతం: మణిశర్మ.


Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events