సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్. మమితాబైజు కథానాయిక. వెంకీ అట్లూరి దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు.రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు.40ఏళ్ల వయసులో కూడా తన కలలను వదలకుండా ముందుకు సాగే, అంతర్జాతీయ పిస్టల్ షూటర్ సంజయ్ విశ్వనాథ్‌గా సూర్యని ఈ టీజర్ పరిచయం చేసింది. తండ్రి ప్రేమ, భావోద్వేగాలతో కూడుకున్న గాఢమైన పాత్రలో ఇందులో ఆయన కనిపించనున్నట్టు టీజర్ చెబుతున్నది. వెంకీ అట్లూరి ప్రభావవంతమైన సంభాషణలు, సూర్య నటన, కథకు కొత్తదనాన్ని జోడించిన మమితా బైజు పాత్ర టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి.

వయస్సు అంతరంతో కూడిన అసాధారణ ప్రేమకథ ఇదని టీజర్ చెబుతోంది. వెంకీ అట్లూరి చిత్రం కచ్చితంగా ప్రేక్షకుల మనసుల్ని గెలుస్తుందని నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. జూలైలో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: నిమిష్ రవి, సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్, సమర్పణ: శ్రీకర స్టూడియోస్, నిర్మాణం: సితార ఎంటర్‌టైన్మెట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్.















