Namaste NRI

అన్ని భాషల్లో వనజీవి రామయ్య

కోటి మొక్కల రామయ్యగా ప్రసిద్ధి చెందిన పర్యావరణ ప్రేమికుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి దరిపల్లి రామయ్య జీవిత కథ ఆధారంగా రూపొందిన లఘుచిత్రం వనజీవి రామయ్య. బ్రహ్మాజీ టైటిల్‌ రోల్‌ పోషించారు. పర్యావరణ సందేశంతో దర్శకుడు వేముగంటి తెరకెక్కించిన ఈ లఘుచిత్రం గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులలో బెస్ట్‌ షార్ట్‌ ఫిల్మ్‌గా ఎంపికైంది.

ఈ లఘుచిత్రాన్ని హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్‌లో ప్రదర్శించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్‌ వెన్నెల, రాజకీయ విశ్లేషకులు వి.ప్రకాష్‌, తన్నేరు బాబూరావు, నాగమహేశ్‌, నటుడు తనికెళ్లభరణి, తమ్మారెడ్డి భరద్వాజ్‌ ఈ కార్యక్రమానికి హాజరై చిత్రబృందాన్ని అభినందించారు. ఈ చిత్రాన్ని దేశంలోని అన్ని భాషల్లో విడుదల చేయనున్నట్టు చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి రచన: డా.కళారంగా, కెమెరా: తోట వి.రమణ, సంగీతం: బల్లేపల్లి మోహన్‌, నిర్మాతలు: నిదిగొండ నరేష్‌కుమార్‌ ప్రజాపతి, భూషం రవీంద్రనాథ్‌, లింగంపల్లి చంద్రశేఖర్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events