Namaste NRI

సందడిగా యూత్ మూవీ ఫ్రెషర్స్ మీట్

కెన్‌ కరునాస్‌, అనిష్మ అనిల్‌కుమార్‌, దేవదర్శిని చేతన్‌, సూరజ్‌ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్‌, మీనాక్షి దినేష్‌ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన తమిళ చిత్రం యూత్‌. ఈ చిత్రాన్ని ఇదే పేరుతో ఈ2సీ సంస్థ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నది. కెన్‌ కరునాస్‌ అండ్‌ గ్యాంగ్‌ ఈచిత్రానికి దర్శకత్వం వహించగా, కరుపయ్య సి.రామ్‌, సులోచన కుమార్‌ నిర్మించారు. ఈ నెల 26న థియేట్రికల్‌ రిలీజ్‌ కానుంది. కమ్‌ విత్‌ యువర్‌ గ్యాంగ్‌, నోట్‌ – నో ఏజ్‌ లిమిట్‌ అనే స్లోగన్‌తో ఈ సినిమా ప్రమోషనల్‌ క్యాంపెయిన్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా ఫ్రెషర్‌ మీట్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి అతిథులుగా దర్శకులు వశిష్ట, వెంకటేష్‌ మహా, రవికిరణ్‌ కోలా, గోపీనాథ్‌రెడ్డి, వెంకటేష్‌ నిమ్మలపూడి, కశ్యప్‌ శ్రీనివాస్‌, సాయి మార్తాండ్‌, హీరో మౌళి తనూజ్‌ తదితరులు విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. చిత్రబృందమంతా ఈ సినిమా విజయంపై ఆశాభావం వెలిబుచ్చారు. ఈ చిత్రానికి కెమెరా: వికి, సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్‌, నిర్మాణం: పారవతా ఎంటర్‌టైన్మెంట్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events