Namaste NRI

మాకు ఎవరి సాయం అక్కర్లేదు.. డొనాల్డ్ ట్రంప్!

ఇజ్రాయేల్‌తో కలిసి ఇరాన్‌ పై యుద్ధం మొదలెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మద్ధతు కరువవుతోంది. ప్రపంచ దేశాలు వారిస్తున్న మొండిగా ముందుకెళ్లాలనుకుంటున్న ట్రంప్‌నకు సాయం చేసేందుకు నాటో దేశాలు తిరస్కరించాయి. అంతేకాదు అమెరికా సైన్యం ఇరాన్‌పై చేస్తున్న యుద్ధంలో తాము పాల్గొనబోమని స్పష్టం చేశాయి. దాంతో, చిర్రెత్తుకొచ్చిన ట్రంప్ మాకు ఎవరి సాయం అక్కర్లేదు అని నాటోదేశాలకు తేల్చి చెప్పారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇరాన్‌పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న పలు దేశాలు హర్మూజ్ జలసంధి వద్దకు ప్రపంచ దేశాలు యుద్ధ నౌకలను పంపడానికి నిరాకరించాయి. ట్రంప్ అభ్యర్థనను నాటో దేశాలు సున్నితంగా తోసిపుచ్చాయి. అమెరికా సైన్యాలతో కలిసి ఇరాన్‌పై యుద్ధం చేయబోమని వాషింగ్టన్ సిటీకి నాటో కూటమిలోని దేశాలు చెప్పేశాయి. దాంతో, ఇదివరకు ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండడాన్ని వ్యతిరేకించిన నాటో దేశాలు ఇప్పుడు తనకు సహకరించకపోవడాన్ని ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారు.

Social Share Spread Message

Latest News