Skip to main content

Namaste NRI

 ఇది హార్ట్‌ టచింగ్‌ లవ్‌స్టోరీ : హర్షిత్‌రెడ్డి

హర్షిత్‌రెడ్డి కథానాయకుడిగా రూపొందిన చిత్రం దీవాన. స్మేహ మణిమేగలై కథానాయిక. శ్రీకాంత్‌ సంగిశెట్టి దర్శకుడు. వాసుదేవ్‌ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మాతలు. ఈ వేసవిలో రిలీజ్‌ కానుంది. ఈ సినిమా సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ జరిగింది. అగ్ర కథానాయిక సమంత ఈ పాటను రిలీజ్‌ చేశారు.

వసంతకోకిల, 7/జి బృందావన్‌ కాలనీ సినిమాల స్థాయిలో ఈ సినిమా ఉంటుంది. ఇది హార్ట్‌ టచింగ్‌ లవ్‌స్టోరీ. మున్నా అనే మిడిల్‌క్లాస్‌ అబ్బాయి జీవన ప్రయాణం ఈ సినిమా అని దర్శకుడు శ్రీకాంత్‌ సంగిశెట్టి తెలిపారు. ఈ సినిమా తర్వాత జనాలు నన్ను చూసే విధానం మారుతుంది. ఈ కథ విన్న ఎైగ్జెట్‌మెంట్‌ ఇంకా నాలో తగ్గలేదు. కమల్‌హాసన్‌కి సద్మా, నాగార్జునకి గీతాంజలి, పవన్‌కు తొలిప్రేమ, విజయ్‌ దేవరకొండకు అర్జున్‌రెడ్డి, నాకు దీవాన అని నమ్మకంగా చెప్పారు హీరో హర్షిత్‌రెడ్డి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events