ఆశిష్ కథానాయకుడిగా దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్న చిత్రం దేత్తడి. ఆదిత్యరావు గంగసాని దర్శకుడు. మంగళవారం గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఇందులో హైదరాబాద్ డ్రమ్మర్ ఘన్ను భాయ్ పాత్రలో ఆశిష్ కనిపించారు. అతని హైదరాబాదీ యాస హైలైట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ హైదరాబాద్‌లో జరిగే సాంస్కృతిక వేడుకలు, పండగల నేపథ్యంలో సాగే కథ ఇది. ఒక బ్యాండ్ కొట్టుకునే యువకుడి జీవితానుభవాలకు దర్పణంలా ఉంటుంది. ఎల్లమ్మ లగ్గం నుంచి బోనాల వరకు, వినాయక చవితి, సదర్ ఇలా హైదరాబాద్ సంస్కృతిని ఆవిష్కరిస్తుందీ చిత్రం అన్నారు. హైదరాబాద్ కల్చర్‌ని ఈ సినిమా ద్వారా ప్రపంచానికి గొప్పగా చూపించబోతున్నామని అన్నారు.

మన పండగలు, మన పాటలు, హైదరాబాద్ సంస్కృతి, అన్నీ కలబోసిన సినిమా ఇదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్, కథ, దర్శకత్వం: ఆదిత్య రావు గంగసాని.















