Namaste NRI

కయాదు లోహర్‌కు బంపర్‌ ఆఫర్‌?

అస్సాం సుందరి కయాదు లోహర్‌ కెరీర్‌లో సక్సెస్‌ అంటే డ్రాగన్‌ సినిమా ఒక్కటే. దానికి ముందుగానీ, తర్వాత గానీ ఈ అందాలభామకు హిట్‌ లేదు. అయితే, అదృష్టం మాత్రం ఈ ముద్దుగుమ్మ వెన్నంటే ఉంది. అందుకే అవకాశాలు క్యూ కడుతున్నాయి. తాజాగా ఓ క్రేజీ టాలీవుడ్‌ మూవీలో కయాదు ఛాన్స్‌ కొట్టేసినట్టు విశ్వసనీయ సమాచారం. వివరాల్లోకెళ్తే.. వెంకటేశ్‌, కల్యాణ్‌రామ్‌ హీరోలుగా, హిట్‌ మిషిన్‌ అనిల్‌ రావిపూడి ఓ మల్టీస్టారర్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో వెంకీకి జోడీగా కీర్తి సురేశ్‌ని ఇప్పటికే సెలక్ట్‌ చేయగా, కల్యాణ్‌రామ్‌ సరసన కయాదు లోహర్‌ని ఖరారు చేసినట్టు తెలిసింది. అపజయం అనేది తెలియని అనిల్‌ రావిపూడి సినిమాలో కథానాయికగా ఛాన్స్‌ లభించడమంటే, అది సాధారణమైన విషయం కాదు. ఇదే నిజమైతే, ఈ అమ్మడి రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events