Skip to main content

Namaste NRI

బ్యాడ్ బాయ్ కార్తిక్ వచ్చేస్తున్నాడు

నాగశౌర్య నటిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ బ్యాడ్‌ బాయ్‌ కార్తిక్‌. రామ్‌ దేశిన(రమేష్‌) దర్శకుడు. శ్రీనివాసరావు చింతలపూడి నిర్మాత. విధి కథానాయిక. ప్రస్తుతం సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకూ, పాటలకూ మంచి స్పందన లభిస్తున్నదని మేకర్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు.

ఒక చేతితో ఆయుధం పట్టుకొని, మరో చేతిని పైకెత్తి పిడికిలి బిగించి, కదనానికి సిద్ధమంటున్నట్టుగా ఉద్రేకంగా నిలబడి చూస్తున్న నాగశౌర్యను పోస్టర్‌లో చూడొచ్చు. ఆయన నేపథ్యంలో మహాకాళి విగ్రహం, జాతర వాతావరణం కనిపిస్తున్నది. ఈ సినిమా థియేట్రికల్‌, నాన్‌ థియేట్రికల్‌ హక్కులను జీ స్టూడియోస్‌ సొంతం చేసుకున్నది. ఏప్రిల్‌ 17న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది. ఈ చిత్రంలో నరేష్‌ వీకే, శ్రీదేవి విజయకుమార్‌, సముద్రఖని కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: రసూల్‌ ఎల్లోర్‌, సంగీతం: హారిస్‌ జైరాజ్‌, నిర్మాణం: శ్రీవైష్ణవి ఫిల్మ్స్‌.

Social Share Spread Message

Latest News