ప్రణవ్‌రావ్, రాణి, ప్రజక్త గైక్వాడ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న యువతరం సినిమా గూగుల్ మై ఫ్రెండ్. గోవింద్ వరాహ దర్శకుడు. దివాకర్‌రెడ్డి నిర్మాత. ఈ సందర్భంగా ఈ సినిమా సాంగ్స్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు. దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య, దర్శకులు వి.సముద్ర, శైలేష్ కొలను, కొండా విజయ్‌కుమార్, సాయిరాజేశ్ పాటలను ఆవిష్కరించి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.

నిర్మాతల సహకారం వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చిందని, పాటలను ఆవిష్కరించిన తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్‌కు కృతజ్ఞతలని దర్శకుడు గోవింద్ వరాహ అన్నారు. సియా రేవాడ్కర్, అశ్విని కులకర్ణి, మాధవ్ అభ్యంకర్, సి.దివాకర్‌రెడ్డి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో సినిమా విడుదల కానుంది.ఈ చిత్రానికి కెమెరా: కిషన్ సాగర్, సంగీతం: ఎస్.సాగర్, కార్తీక్, లిరిక్ జాన్సన్, నిర్మాణం: డాలర్స్ మీడియా అండ్ ఎంటర్‌టైన్మెంట్స్.















