Namaste NRI

మనుషులంతా ఒక్కటేనని చెప్పే చిత్రం

మలయాళ అగ్రహీరో టొవినో థామస్‌ నటిస్తున్న తాజా చిత్రం పళ్లిచట్టంబి. డిజో జోస్‌ ఆంటోని దర్శకుడు. కయాదు లోహర్‌ కథానాయిక. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. 50వ దశకం నేపథ్యంలో సాగే సినిమా ఇదని, దీనికోసం ఎంతో పరిశోధన చేశామని, అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా సినిమాను తీర్చిదిద్దామని హీరో టొవినో థామస్‌ తెలిపారు.

మనుషులంతా ఒక్కటే అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తీశామని, రాజకీయాలు ఎంత మారినా మనుషుల జీవన సంఘర్షణ మాత్రం ఏమీ మారలేదనే అంశాన్ని ఈ సినిమా చర్చిస్తుందని దర్శకుడు చెప్పారు. సాధారణ కథతో అందరికీ కనెక్ట్‌ అయ్యే చిత్రమిదని నిర్మాతలు చాణక్య, చైతన్య, చరణ్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందమంతా పాల్గొన్నారు. ఈ పాన్‌ ఇండియా చిత్రం ఏప్రిల్‌ 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్‌ బిజోయ్‌, దర్శకత్వం: డిజో జోస్‌ ఆంటోనీ.


Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events