Skip to main content

Namaste NRI

ఇరాన్ సంచలన నిర్ణయం …అమెరికాతో

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నట్టు కనిపిస్తున్నది. ఓవైపు సీజ్‌ఫైర్‌ కొనసాగుతుండగానే దాడులు జరుగుతున్నాయి. తాజాగా లెబనాన్‌ మీద ఇజ్రాయెల్‌ దాడిచేయడంపై ఇరాన్‌ తీవ్రంగా స్పందించింది. వెంటనే అమెరికాతో శాంతి ఒప్పంద చర్చలు ఆపేసినట్టు తెలిసింది. కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్‌ కూడా ఉందని, అయితే ఒప్పందాన్ని బ్రేక్‌ చేసి దాడులు చేశారని ఆరోపించింది. అలాగే హొర్ముజ్‌ను పూర్తిగా మూసేయడానికి టెహ్రాన్‌ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. హొర్ముజ్‌తోపాటు బాబ్‌ అల్‌ మండెబ్‌ జలసంధిని కూడా మూసివేసేందుకు ఇరాన్‌, రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ సిద్ధమైనట్టు తెలిసింది.

దక్షిణ లెబనాన్‌పై దాడులకు ఇజ్రాయెల్‌ ఆదేశించడంతో తాజా ప్రతిష్ఠంభన ఏర్పడింది. లెబనాన్‌ మీద దాడుల తర్వాత ట్రంప్‌నకు ఇరాన్‌ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్‌ అరాగ్చి వార్నింగ్‌ ఇచ్చారు. యూఎస్‌-ఇరాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్‌ కూడా ఉందని చెప్పారు. కానీ ఇజ్రాయెల్‌ దాన్ని మర్చిపోయి దాడులు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు అబ్బాస్‌ వెల్లడించారు. దీనికి యూఎస్‌, ఇజ్రాయెల్‌ బాధ్యత వహించాలన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events