Namaste NRI

పొల్లాచ్చిలో కొత్త షెడ్యూల్‌కు సిద్ధమైన మెగా 158

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ మెగా 158 పై సినీ వర్గాల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. కేఎస్‌ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న చిత్రం షూటింగ్‌ ఇటీవలే లాంఛనంగా మొదలైన విషయం తెలిసిందే. తాజా షెడ్యూల్‌లో చిరంజీవి, అనస్వర రాజన్‌లపై కీలకమైన సన్నివేశాలను దర్శకుడు బాబీ చిత్రీకరించారు. త్వరలోనే నెక్ట్స్‌ షెడ్యూల్‌ని కూడా మొదలపెట్టనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ నెల నుంచే పొలాచ్చిలో కొత్త షెడ్యూల్‌ ప్రారంభం కానున్నది. రెండు వారాలపాటు సాగే ఈ షెడ్యూల్‌లో చిత్ర ప్రధాన తారాగణమంతా పాల్గొంటారని వినికిడి. ఇక ఇందులో చిరంజీవి పాత్ర చాలా ఎమోషనల్‌గా ఉంటుందని ఇన్‌సైడ్‌ టాక్‌.

వాల్తేరువీరయ్య లో చిరంజీవిలోని హ్యూమర్‌ని హైలైట్‌ చేసిన బాబీ, ఈ సినిమాలో మెగాస్టార్‌లోని ఎమోషనల్‌ యాంగిల్‌ని చూపిచనున్నారని వినికిడి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, హీరో నారా రోహిత్‌ ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర పోషించనున్నారట. కథలో ఆయన పాత్ర ఆసక్తికరంగా ఉంటుందని తెలిసింది. ఉన్నతమైన సాంకేతిక విలువలతో కేవిఎన్‌ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్నది. తమన్‌ సంగీత దర్శకుడు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events