Namaste NRI

డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన …త్వరలో

అమెరికా–ఇరాన్ మధ్య ఒప్పందం కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. త్వరలో ఇరాన్–అమెరికా మధ్య మంచి ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్నారు. ట్రంప్ మీడియాతో మాట్లాడారు.ఇరాన్‌తో ఒక మంచి డీల్‌ కుదుర్చకునేందుకు దగ్గరగా ఉన్నాం. ఒకవేళ చర్చలు విఫలమైతే సైనిక చర్య అనే మార్గం ఇంకా తెరిచే ఉంది. మేం మళ్లీ తిరిగి వెళ్లి ఇరాన్‌ను అంతం చేస్తాం. ఇరాన్‌తో కుదుర్చుకునే ఏ ఒప్పందమైనా సరే, అణ్వాయుధ దేశంగా ఉండటానికి మాత్రం అంగీకరించం. మేం కావాలనే వారి సైన్యాన్ని ఓడించాం. నేను ఒప్పందానికే ఇష్టపడతా. ఎందుకంటే సంతకం అయిన వెంటనే హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవవచ్చు. కానీ, ఆ దేశానికి అణ్వాయుధాలు ఉండవు అనే విషయంలో నేను హామీ ఇవ్వగలను. దీనికి వాళ్లు అంగీకరించారు అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

Social Share Spread Message

Latest News