Namaste NRI

ఈ సినిమా అందరికి నచ్చుతుంది : నాగశౌర్య

నాగశౌర్య హీరోగా రామ్‌ దేశినా (రమేష్‌) దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ డ్రామా బ్యాడ్‌ బాయ్‌ కార్తీక్‌. శ్రీనివాసరావు చింతలపూడి నిర్మాత. థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో నాగశౌర్య పవర్‌ఫుల్‌ మాస్‌ పాత్రలో కనిపించారు. అమాయకుల్ని కాపాడే ప్రయత్నంలో కార్తీక్‌ దుష్టశక్తులతో పోరాడే క్రమాన్ని ఇంటెన్స్‌ ఎమోషన్స్‌తో ఆవిష్కరించారు. ట్రైలర్‌ చివర్లో నాగశౌర్య లక్ష్మీనరసింహ స్వామి ప్రజెన్స్‌లో కనిపించడం హైలైట్‌గా నిలిచింది. యాక్షన్‌, ఎమోషన్స్‌, కామెడీ అంశాలతో ఈ సినిమా అందరికి నచ్చుతుందని నాగశౌర్య తెలిపారు. ఈ సినిమాలో నాగశౌర్య పాత్రలోని వేరియేషన్స్‌ అందరినీ సర్‌ప్రైజ్‌కు గురిచేస్తాయని, సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నామని నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు చెప్పారు. విధి, సముద్రఖని, నరేష్‌ వీకే, సాయికుమార్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: హారిస్‌ జైరాజ్‌, నిర్మాణ సంస్థ: శ్రీవైష్ణవి ఫిల్మ్స్‌, రచన-దర్శకత్వం: రామ్‌ దేశిన (రమేష్‌).


Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events