Namaste NRI

సాకులు చెప్పడం సరికాదు.. మంగ్లీ పాడిన పాట కాంట్రావర్సీపై మహిళా కమిషన్ సీరియస్

ప్రేమ్ దర్శకత్వంలో రాబోతున్న మూవీ ‘కేడీ: ది డెవిల్‌’ . ఈ సినిమాలో కన్నడ నటుడు ధృవ సర్జా హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలోని ‘సర్కే చునార్‌ తేరీ సర్కే’ పాట వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీనిపై విచారణకు హాజరుకావాలంటూ నోరా ఫతేహి, సంజయ్‌దత్‌లకు జాతీయ మహిళా కమిషన్ ఇటీవల సమన్లు జారీ చేసింది.

అయితే ఈ విషయంపై నోరా వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది అయితే ఏప్రిల్ 6న జరిగిన విచారణకు నోరా ఫతేహి తరపు లాయర్ హాజరుకావడంపై మహిళా కమిషన్ మండిపడింది. ఇందుకు ఏప్రిల్ 27 వరకు సమయం ఇచ్చింది.ఏప్రిల్ 8న సంజయ్ దత్ కూడా విచారణకు హాజరుకావాలని తెలిపింది. ఈ పాటలోని సాహిత్యం, విజువల్స్ మహిళల గౌరవానికి భంగం కలిగించేలా, పాటలోని సాహిత్యం అభ్యంతరకరంగా ఉందని కమిషన్ అభిప్రాయపడింది. దీనిపై దర్శకుడు ఇప్పటికే స్పందిస్తూ ఇది కేవలం వినోదం కోసం చేసిన పాట మాత్రమే అని ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యము తమకు లేదని వివరణ ఇచ్చారు. ధృవ్ సర్జ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో నోరా ఫతేహీ, సంజయ్ దత్ కీలక పాత్రలు పోషించారు,ఏప్రిల్ 30న ఈ సినిమా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events