Namaste NRI

అఖిల్ బర్త్‌డే స్పెషల్‌గా.. లెనిన్ న్యూ పోస్టర్ విడుదల

తాజా చిత్రం లెనిన్‌ విషయంలో హీరో అక్కినేని అఖిల్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. రాయలసీయ గ్రామీణ నేపథ్యంలో బలమైన సామాజికాంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలిసింది. మురళీకిషోర్‌ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మనం ఎంటర్‌ప్రైజెస్‌, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. అక్కినేని అఖిల్‌ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్‌ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమా జూన్‌ 26న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో అఖిల్‌ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కనిపిస్తాడని, ఆయన మేకోవర్‌ సర్‌ప్రైజ్‌ చేస్తుందని, కెరీర్‌కు మలుపునిచ్చే చిత్రమవుతుందని మేకర్స్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి తమన్‌ స్వరకర్త.


Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events