Namaste NRI

వైవిధ్యమైన కథతో పరమపద సోపానం.. విడుదలకు సిద్ధమైన అర్జున్ మూవీ

అర్జున్ అంబటి కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం పరమపద సోపానం. నాగ శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకుని, ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. డేవ్ జాండ్ ఈ మూవీకి స్వరాలు సమకూర్చారు. ఇప్పటికే విడుదలైన టీజర్, లిరికల్ సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది.

తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఇందులో హీరో అర్జున్ అంబటి లుక్ చాలా ఇంటెన్స్‌గా ఉండి, సినిమా నేపథ్యంపై ఆసక్తిని కలిగిస్తోంది. వైవిధ్యమైన కథాంశంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఏప్రిల్ 24న అర్జున్ అంబటి తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోబోతున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events