Skip to main content

Namaste NRI

ట్రంప్‌నకు మద్దతు ఇవ్వడం లేదు : కీర్ స్టార్మర్ షాక్

హార్ముజ్ జలసంధిని దిగ్బంధించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. అయితే, ఈ విషయంలో అమెరికా మిత్ర దేశంగా పేరున్న బ్రిటన్ షాకిచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయంలో తాము ట్రంప్‌నకు మద్దతు ఇవ్వడం లేదని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ స్పష్టం చేశారు. హార్ముజ్‌ను దిగ్బంధించాలంటూ అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తుత అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. తమ దేశం ఉద్రిక్తతలు పెరగాలని కోరుకోదని, స్థిరత్వానికే ప్రాధాన్యమిస్తుందన్నారు. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన నౌక రవాణా మార్గమైన హార్ముజ్ జలసంధిని మూసేయకుండా, సురక్షితంగా నౌకలు రవాణా జరిగేలా చూడాలన్నారు. హార్ముజ్‌ను సైనిక చర్య ద్వారా అడ్డుకోవడంకన్నా, దీన్ని పూర్తిస్థాయిలో ఎలా అందుబాటులోకి తీసుకురావాలో ప్రయత్నించాలని సూచించారు. తమ దేశ నావికా దళం ఇతర నౌకల్ని, మార్గాల్ని అడ్డుకోవడం కన్నా, సురక్షితంగా నౌకల రవాణా జరిగేలా చూడటం కోసమే పని చేస్తుందని స్టార్మర్ వివరించారు.

అంతకుముందు కూడా కీర్ స్టార్మర్ ఇరాన్ యుద్ధంపై స్పందించారు. తాము ఇరాన్ యుద్ధంలో అమెరికాతో కలిసి పాల్గొనడం లేదని తెలిపారు. సరైన ప్రణాళిక, చట్టపరమైన అవసరాలు లేకుండా యుద్దంలోకి దిగబోమని చెప్పారు. భారీ యుద్ధంలో పాల్గొనడం కన్నా, జాగ్రత్తగా, స్వతంత్రంగా వ్యవహరించడమే ఈ పరిస్తితిల్లో మంచిది అని అభిప్రాయపడ్డారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events