Skip to main content

Namaste NRI

రామ్ చరణ్‌కు మరో అరుదైన గౌరవం

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరోసారి అంతర్జాతీయ వేదికపై తన ముద్ర వేసుకున్నారు. ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ఎస్క్వైర్ ఇండియా ఏప్రిల్ ఎడిషన్ కవర్ పేజీపై ఆయన దర్శనమిచ్చారు. దుబాయ్‌లో ప్రత్యేకంగా నిర్వహించిన ఈ ఫోటోషూట్‌లో రామ్ చరణ్ స్టైలిష్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న చర, ఈ కవర్ ఫీచర్‌తో మరో మైలురాయిని అందుకున్నారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇదే మ్యాగజైన్ కవర్‌పై కనిపించగా, ఇప్పుడు ఆ ఘనత సాధించిన రెండో తెలుగు హీరోగా రామ్ చరణ్ నిలిచారు. దీంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఫోటోషూట్‌లో చరణ్ స్టైలింగ్, ప్రెజెన్స్ అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోకుండా ఉండటంతో, ఆయన గ్లోబల్ అప్పీల్ మరింత బలపడిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Social Share Spread Message

Latest News