Namaste NRI

మహేష్ బాబు రిలీజ్ చేసిన శ్రీనివాస మంగాపురం టీజర్

సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు జయకృష్ణ హీరోగా పరిచయమవుతున్న చిత్రం శ్రీనివాస మంగాపురం. అజయ్‌భూపతి దర్శకత్వం. ఈ చిత్రాన్ని పి.కిరణ్‌ నిర్మిస్తున్నారు. రవీనా టాండన్‌ కుమార్తె రాషా తడానీ కథానాయికగా నటిస్తున్నది. సీనియర్‌ నటుడు మోహన్‌బాబు విలన్‌ పాత్రలో కనిపించనున్నారు. అగ్ర హీరో మహేశ్‌బాబు టీజర్‌ను విడుదల చేశారు. తిరుపతి నేపథ్యంలో సాగే ఈ కథలో, వాసు బాబు, మంగా అనే ఇద్దరు స్నేహితులు ప్రేమికులుగా మారి ఆనందంగా జీవించే ప్రయాణాన్ని చూపించారు.

ఓ అనూహ్య సంఘటన వారి జీవితాల్ని మలుపు తిప్పుతుంది. మంగాను వదిలివెళ్లలేని వాసు బాబు, ప్రేమకోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడతాడు. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలతో టీజర్‌ ఆసక్తికరంగా సాగింది. ట్రెండీ రొమాన్స్‌, ఇంటెన్స్‌ యాక్షన్‌ ఘట్టాలతో ఆకట్టుకుంది. మోహన్‌బాబు విలన్‌గా కనిపిస్తూ కథపై మరింత ఆసక్తినిరేకెత్తించారు. త్వరలో ఈ చిత్రం విడుదలకానుంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్‌, సమర్పణ: అశ్వినీదత్‌, రచన-దర్శకత్వం: అజయ్‌భూపతి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events