Namaste NRI

రామ్‌చరణ్‌ పెద్ది.. మరోసారి వాయిదా

అగ్ర హీరో రామ్‌చరణ్‌ తాజా చిత్రం పెద్ది విడుదల మరింత ఆలస్యం కానుంది. ఇప్పటికే ఓసారి వాయిదా పడ్డ ఈ చిత్రాన్ని మరోమారు వాయిదా వేశారు. ఈ నెల 30న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని జూన్‌ నెలకు వాయిదా వేశామని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఒక్క పాట మినహా సినిమా షూటింగ్‌ మొత్తం పూర్తయింది. ప్రచార చిత్రాలకు ప్రేక్షకులు మంచి ఆదరణ కనబరిచారు. వారికి ధన్యవాదాలు. సినిమా అవుట్‌పుట్‌పై టీమ్‌ అందరం సంతోషంగా ఉన్నాం. గొప్ప కంటెంట్‌ను మరింత ఉన్నతీకరించి ప్రజెంట్‌ చేయాలనుకుంటున్నాం. అందుకు నిర్మాణానంతర కార్యక్రమాలకు మరింత సమయం అవసరమైంది. ప్రేక్షకులకు ఉత్తమ థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందించాలనే లక్ష్యంతో సినిమా విడుదలను వాయిదా వేశాం అని మేకర్స్‌ ప్రకటనలో తెలిపారు.

మార్చిలో రావాల్సిన ఈ సినిమా ఈ నెల 30కి వాయిదా పడిన విషయం తెలిసిందే. మరోమారు రిలీజ్‌ను పోస్ట్‌పోన్‌ చేయడంతో అభిమానులు కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. రూరల్‌ స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్నది. జాన్వీకపూర్‌, శివరాజ్‌కుమార్‌, దివ్యేందుశర్మ, జగపతిబాబు కీలక పాత్రల్ని పోషిస్తున్నారు.


Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events