Namaste NRI

బెల్లంకొండ గణేష్‌తో న్యూ ఏజ్ లవ్ స్టోరీ మూవీ ప్రారంభం

దర్శకుడు ఏ.కరుణాక‌ర‌న్ దాదాపు 8 ఏళ్ల విరామం తర్వాత కొత్త సినిమాతో రీఎంట్రీ ఇస్తుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. 2018లో వచ్చిన తేజ్ ఐ ల‌వ్‌యూ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న కరుణాకరన్, ఇప్పుడు యువ హీరో బెల్లంకొండ గ‌ణేష్‌తో కలిసి కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కనుంది. కరుణాకరన్ స్టైల్‌కు తగ్గట్లుగా సాఫ్ట్ ఎమోషన్స్, క్యూట్ లవ్ స్టోరీతో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం.

హైదరాబాద్‌లో ఈ చిత్రానికి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు వివి వినాయ‌క్ ముఖ్య అతిథిగా హాజరై తొలి క్లాప్ కొట్టగా, యువ దర్శకుడు అనుదీప్ కేవీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సినిమాకు అనుదీప్ డైలాగ్స్ అందించనుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. జాతి రత్నాలు లో తన యూనిక్ కామెడీతో ఆకట్టుకున్న అనుదీప్ టచ్ ఈ చిత్రానికి హైలైట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. గోల్డెన్ టర్టిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మౌనికా రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీ, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

Social Share Spread Message

Latest News