
టాలీవుడ్‌లో తనదైన టైమింగ్‌తో నవ్వులు పూయించే కమెడియన్ సత్య హీరోగా నటించిన సినిమా జెట్లీ. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ సినిమాపై మంచి అంచనాలు పెంచగా, తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తోంది. మిస్ యూనివర్స్ ఇండియా-2024 రియా సింఘా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించడం విశేషం. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, వైవా హర్ష, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించగా.. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమాకు కాల భైరవ సంగీతాన్ని అందించారు.ఈ చిత్రం మే 1న థియేటర్లలోకి రానుంది.















