గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన అజారుద్దీన్, కోదండరాం తో శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి వారి చాంబర్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, డాక్టర్ వివేక్ వెంకటస్వామి, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి , ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రి అజారుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ గా తనను ప్రతిపాదించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి , మంత్రి మండలికి,పీసీసీ కి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.మైనారిటీల సంక్షేమానికి మరింత కృషి చేస్తానని తెలిపారు.















