Skip to main content

Namaste NRI

శాసన మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి అజారుద్దీన్, ప్రొ. కోదండరాం

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన అజారుద్దీన్, కోదండరాం తో శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి వారి చాంబర్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, డాక్టర్ వివేక్ వెంకటస్వామి, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి , ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రి అజారుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ గా తనను ప్రతిపాదించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి , మంత్రి మండలికి,పీసీసీ కి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.మైనారిటీల సంక్షేమానికి మరింత కృషి చేస్తానని తెలిపారు.

Social Share Spread Message

Latest News