Namaste NRI

యదార్థ సంఘటనతో దూరదర్శిని

సువిక్షిత్‌, గీతికా రతన్‌ జంటగా నటిస్తున్న చిత్రం దూరదర్శిని. కలిపింది ఇద్దరిని ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో జయశంకర్‌ రెడ్డి, పాటిమీది సంతోష్‌ నిర్మించారు. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశామని, 90వ దశకంలో చిత్రలహరి చూసిన నాటి రోజుల్ని గుర్తుకుతెస్తుందని, హృదయానికి హత్తుకునే ప్రేమకథగా అలరిస్తుందని దర్శకుడు చెప్పారు. దూరదర్శిని ఓ జంటను ఎలా కలిపిందన్నదే కథాంశమని, ప్రతీ ఒక్కరికి కన్నీళ్లు తెప్పిస్తుందని హీరో సువిక్షిత్‌ పేర్కొన్నారు. ఇలాంటి ప్రేమకథలు చాలా అరుదుగా వస్తాయని కథానాయిక గీతికా రతన్‌ తెలిపింది. మే 15న ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events