
సువిక్షిత్, గీతికా రతన్ జంటగా నటిస్తున్న చిత్రం దూరదర్శిని. కలిపింది ఇద్దరిని ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో జయశంకర్ రెడ్డి, పాటిమీది సంతోష్ నిర్మించారు. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశామని, 90వ దశకంలో చిత్రలహరి చూసిన నాటి రోజుల్ని గుర్తుకుతెస్తుందని, హృదయానికి హత్తుకునే ప్రేమకథగా అలరిస్తుందని దర్శకుడు చెప్పారు. దూరదర్శిని ఓ జంటను ఎలా కలిపిందన్నదే కథాంశమని, ప్రతీ ఒక్కరికి కన్నీళ్లు తెప్పిస్తుందని హీరో సువిక్షిత్ పేర్కొన్నారు. ఇలాంటి ప్రేమకథలు చాలా అరుదుగా వస్తాయని కథానాయిక గీతికా రతన్ తెలిపింది. మే 15న ప్రేక్షకుల ముందుకురానుంది.















