Namaste NRI

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో .. నితిన్ కొత్త సినిమా ప్రారంభం

హీరో నితిన్‌ తాజా చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. రితికా నాయక్‌ కథానాయిక. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి నారి సిరిసవాడ, సోమశేఖర్‌ టి సంయుక్త దర్శకత్వం వహిస్తున్నారు. విభిన్న కథాంశంతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని, ఈ నెల రెండోవారం నుంచి చిత్రీకరణ మొదలుపెడతామని మేకర్స్‌ తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి కెమెరా: అనిత్‌ మదాడి, సంగీతం: సురేష్‌ బొబ్బిలి, ఆర్ట్‌: జానీషేక్‌, నిర్మాణ సంస్థ: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్‌ సినిమాస్‌, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events