Skip to main content

Namaste NRI

అందరికీ గుర్తుండిపోయే సినిమా ఇది : మధుదీప్‌

త్రిగుణ్‌, పాయల్‌ రాధాకృష్ణ, అనీష్‌ కురువిల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మిస్టర్‌ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌. మధుదీప్‌ చెలికాని దర్శకుడు. అరవింద్‌ మాండ్యం నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ని నిర్వహించారు. మనం నిజజీవితం లో చూసే పాత్రలు, సంఘటనలతో కూడిన ప్రేమకథ ఇది.ఈ ప్రేమకథలోని సంఘర్షణ అందరికీ కనెక్టయ్యేలా ఉంటుంది. అందరికీ గుర్తుండిపోయే సినిమా ఇది అని దర్శకుడు మధుదీప్‌ నమ్మకం వ్యక్తంచేశారు. ఇంకా నిర్మాత అరవింద్‌, హీరోహీరోయిన్లు త్రిగుణ్‌, పాయల్‌ రాధాకృష్ణ, పంపిణీదారుడు ముత్యాల రాందాస్‌ కూడా మాట్లాడారు. ఈ చిత్రం ఈనెల 15న విడుదల కానున్నది. ఈ చిత్రానికి కెమెరా: రవికుమార్‌.వి, సంగీతం: ప్రకాశ్‌ చెరుకూరి, అరుణ్‌ చిలువేరు, సమర్పణ: సీహెచ్‌వీఎస్‌ఎన్‌ బాబ్జీ, నిర్మాణం: లోటస్‌ క్రియేటివ్‌ వర్క్స్‌.

Social Share Spread Message

Latest News