Namaste NRI

ఈ సినిమా తప్పకుండా అందర్నీ అలస్తుంది : ప్రియదర్శి

సువిక్షిత్‌, గీతికా రతన్‌ జంటగా యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఫీల్‌గుడ్‌ లవ్‌ డ్రామా దూరదర్శిని. కలిపింది ఇద్దరిని ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకుడు. ఎం.జయశంకర్‌రెడ్డి, పాటిమీది సంతోష్‌ నిర్మాతలు. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీరిలీజ్‌ వేడుకను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.హీరో ప్రియదర్శి, రాజు వెడ్స్‌ రాంబాయ్‌ దర్శకుడు సాయి కంపాటి ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ఈ సినిమాలోని భావోద్వేగాలు అందర్నీ హత్తుకుంటాయని, చిన్న సినిమాగా విడుదలవుతున్న ఈ సినిమా, రిలీజ్‌ తర్వాత పెద్ద సినిమా అవుతుందని దర్శకుడు కార్తికేయ కొమ్మి నమ్మకం వ్యక్తం చేశారు.

ఈ సినిమా ట్రైలర్‌ చూడగానే నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. ఆ రోజుల్లో అందరికి ప్రపంచాన్ని పరిచయం చేసింది దూరదర్శని. నేను కూడా చిన్నప్ప్పుడు దూరదర్శన్లో సినిమాలు చూసి స్ఫూర్తి పొంది, నటుడిగా మారాను. ఈ దూరదర్శని సినిమా సమీప దర్శనిగా ప్రేక్షకులను థియేటర్‌కు తీసుకొచ్చి, సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇలాంటి చిన్న సినిమాకు ప్రేక్షకుల ఆదరణ ఎంతో ముఖ్యం. ఈ సినిమా తప్పకుండా అందర్నీ అలస్తుంది అని ప్రియదర్శి చెప్పారు. ఇంకా నటులు సువిక్షిత్‌, జెమినీ సురేశ్‌ కూడా మాట్లాడారు. ఈ నెల 15న సినిమా విడుదల కానున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events