Skip to main content

Namaste NRI

ది రెడ్ బ్యాగ్.. పవర్ ఫుల్ పాత్రలో సీనియర్ హీరోయిన్ .. ఫస్ట్ లుక్ విడుదల

ఓ బ్యాగ్‌ చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ది రెడ్‌ బ్యాగ్‌. కబీర్‌సింగ్‌, ప్రసాద్‌ బెహరా, రాధ్య, మోనిక ప్రధాన పాత్రధారులు. రవికుమార్‌ సీరపు దర్శకుడు. హరికృష్ణ సోమిశెట్టి నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్నది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా ఈ సినిమాలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్న రాశి పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. ఇందులో ఆమె సావిత్రిగా పవర్‌ఫుల్‌ రోల్‌ పోషిస్తున్నదని, కథను మలుపు తిప్పే కీలకమైన పాత్ర ఇదని మేకర్స్‌ తెలిపారు. స్నేహాసింగ్‌, ఆకాంక్ష, ఈషాన్‌ శంకర్‌, అవినాష్‌ బదల్‌, భార్గవి ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: విక్రమ్‌రాజా, కెమెరా: ప్రియేష్‌ గురుసామి, సంగీతం: శేఖర్‌ మోపురి.

Social Share Spread Message

Latest News