రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చైనా చేరుకున్నారు. చైనా రాజధాని బీజింగ్‌లో అడుగుపెట్టిన పుతిన్‌కు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఘన స్వాగతం పలికారు. అనంతరం బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ ద పీపుల్‌లో పుతిన్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఘన స్వాగతం పలికారు. పుతిన్, జిన్‌పింగ్ మధ్య ఇరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరగనున్నాయి. అలాగే, ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ వార్, వ్యాపార, వాణిజ్య, రక్షణరంగం సహా అనేక అంశాలపై చర్చిస్తారు. రెండు రోజులపాటు పుతిన్ చైనాలో పర్యటిస్తారు.

గత వారమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో అగ్రదేశాలైన రష్యా, అమెరికా అధ్యక్షులు.. వారం వ్యవధిలోనే మరో అగ్రదేశమైన చైనాలో పర్యటించడం అత్యంత ఆసక్తి కలిగిస్తోంది. చైనా పర్యటన సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉన్నత దశకు చేరుకున్నాయని వ్యాఖ్యానించారు.





























