Skip to main content

Namaste NRI

భారీ లేఆఫ్‌లతో హెచ్‌-1బీ ఉద్యోగులు విలవిల .. నిబంధనలు కఠినం చేసిన అమెరికా

అమెరికాలోని వేలాది భారతీయ టెక్‌ ఉద్యోగులకు గడిచిన కొన్ని నెలలు కాలంతో పోరాటంగా మారాయి. ఒక్క ఉద్యోగ తొలగింపు ఈమెయిల్‌ హఠాత్తుగా ఒకరి జీవితాన్నే ప్రమాదంలో పడేయగలదు. ఉద్యోగాలు, ఇళ్లు, పిల్లల చదువులు, చివరికి దేశంలో నివసించే హక్కుకు కూడా ముప్పు వాటిల్లవచ్చు. మెటా, అమెజాన్‌, ఒరాకిల్‌ వంటి కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుండటంతో అమెరికా ఇమిగ్రేషన్‌ నిబంధనలు విధించిన కఠినమైన 60 రోజుల గడువు కారణంగా హెచ్‌-1బీ వీసాలపై నివసిస్తున్న చాలా మంది భారతీయులు ఇప్పుడు జీవనోపాధి కోసం పోరాడుతున్నారు.

హెచ్‌-1బీ విధానం కింద ఉద్యోగాలు కోల్పోయిన విదేశీ ఉద్యోగులకు తమకు స్పాన్సర్‌షిప్‌ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న మరో యజమానిని కనుగొనడానికి కేవలం 60 రోజుల సమయం మాత్రమే లభిస్తుంది. ఒకవేళ వారు విఫలమైతే అమెరికా విడిచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. అక్కడ తమ జీవితాలను నిర్మించుకోవడానికి పలు సంవత్సరాలు గడిపిన చాలా మంది భారతీయులకు ఈ ఒత్తిడి దుర్భరంగా మారుతున్నది. మరింత గడువు సంపాదించుకోవడానికి ఉద్యోగాలు కోల్పోయిన పలువురు ఉద్యోగులు ఇప్పుడు తాత్కాలికంగా బీ-2 విజిటర్‌ వీసాలకు మారడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఈ వీసా ద్వారా వారు ఆరు నెలల వరకు అమెరికాలో ఉండవచ్చు. కానీ ఆ మార్గం కూడా అంతకంతకూ కష్టతరం అవుతున్నదని ఇమిగ్రేషన్‌ నిపుణులు అంటున్నారు.

Social Share Spread Message

Latest News