Skip to main content

Namaste NRI

సందీప్‌ రెడ్డి వంగా నిర్మాతగా రోమాంచకం…టైటిల్‌ పోస్టర్‌ విడుదల

అర్జున్‌ రెడ్డి, కబీర్‌సింగ్‌, యానిమల్‌ వంటి పాన్‌ ఇండియా బ్లాక్‌బస్టర్స్‌ను అందించిన నిర్మాణ సంస్థ భద్రకాళీ పిక్చర్స్‌ తెరకెక్కిస్తున్న తాజా తెలుగు చిత్రానికి రోమాంచకం అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అగ్ర దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని ఆయన సోదరుడు ప్రణయ్‌ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. సుమంత్‌ ప్రభాస్‌, అనంతిక సనీల్‌ కుమార్‌ జంటగా నటిస్తున్న ఈ సినిమా ద్వారా వేణుగోపాల్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. యూత్‌ఫుల్‌ అండ్‌ పొయొటిక్‌ ఫీల్‌తో పోస్టర్‌ ఆకట్టుకునేలా ఉంది. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ అనే ట్యాగ్‌లైన్‌ కథపై ఆసక్తినిరేకెత్తిస్తున్నది. నవ్యత కలబోసిన ప్రేమకథా చిత్రమిదని, త్వరలో మరిన్ని అప్‌డేట్స్‌ అందిస్తామని మేకర్స్‌ తెలిపారు. ఉపేంద్ర లిమయె, వెంకటేష్‌ కాకుమాను, నరేంద్ర రవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వాసుకి వైభవ్‌, సమర్పణ: సందీప్‌రెడ్డి వంగా, నిర్మాత: ప్రణయ్‌ రెడ్డి వంగా, రచన-దర్శకత్వం: వేణుగోపాల్‌ రెడ్డి.

Social Share Spread Message

Latest News