Namaste NRI

పోలీస్‌ కైంప్లెంట్‌ ట్రైలర్‌ లాంచ్‌

వరలక్ష్మి శరత్‌కుమార్‌, నవీన్‌చంద్ర ప్రధాన పాత్రధారులుగా రూపొందిన హారర్‌, యాక్షన్‌ థ్రిల్లర్‌ పోలీస్‌ కైంప్లెంట్‌. సంజీవ్‌ మాగోటి దర్శకుడు. బాలకృష్ణ మహారాణా నిర్మాత. ఈ సందర్భంగా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో భాగంగా రెండు ప్రత్యేక గీతాలను కూడా రిలీజ్‌ చేశారు. వీటిలో సూపర్‌స్టార్‌ కృష్ణ నటించిన పలు చిత్రాల టైటిల్స్‌ను గుర్తుచేస్తూ రూపొందిన పాటను కృష్ణ అభిమానుల చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ పాటలో కృష్ణ వీరాభిమాని, నటుడు కృష్ణసాయి, ప్రీతి సుందర్‌ నటించారు. చిత్ర దర్శకుడు సంజీవ్‌ మేగోటి ఈ పాటను రాసి స్వరపరిచారు. అలాగే నువ్వట్టా సూత్తా ఉంటే అంటూ సాగే మరో గీతాన్ని తెలంగాణ డీఐజీ రమణారెడ్డి విడుదల చేశారు. కృతి వర్మపై ఈ పాట చిత్రీకరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో టి.ప్రసన్నకుమార్‌, నిర్మాతలు ఆర్‌. సీతారామరాజు, ఘంటా శ్రీనివాసరావు, కృష్ణ మేకప్‌మ్యాన్‌ మాధవరావు తదితరులు పాల్గొన్నారు. జూన్‌ 12న సినిమా విడుదల కానున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events