Namaste NRI

అమెరికాలో తెలంగాణ వాసి మృతి

అమెరికాలోని లూసియానాలో ఓ తెలుగు యువకుడు మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన అనురూప్ రెడ్డి, నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న తన స్నేహితులను కాపాడి అనంతరం నీటిలో మునిగి చనిపోయాడు. అయితే అనురూప్ కాలుకు చేపలు పట్టే వల చిక్కుకోవడమే అతడి మృతికి ప్రధాన కారణమని అక్కడి పోలీస్ వర్గాలు తెలిపాయి. రెస్క్యూ టీమ్ 20 అడుగుల లోతులో నుంచి అనురూప్ రెడ్డి మృతదేహాన్ని బయటకు తీసింది. అనురూప్ కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్ లోని కవాడిగూడలో నివాసం ఉంటోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events