తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన నటనతో, పవర్ఫుల్ డైలాగులతో బాక్సాఫీస్‌ను కుదిపేస్తున్న ‘నటసింహం’ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను ఛార్లెట్ లో ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ ను కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు. వయసు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే అని నిరూపిస్తూ, ఐదు దశాబ్దాలుగా వెండితెరపై రారాజులా వెలుగుతున్న బాలయ్య.. నేటికీ అదే జోష్‌తో కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తున్నారని, తన సెకండ్ ఇన్నింగ్స్ ‘అఖండ’ చిత్రంతో స్టార్ట్ చేసిన బాలకృష్ణ, వరుసగా వంద కోట్ల క్లబ్ సినిమాలతో మూడు తరాల ప్రేక్షకులను అలరిస్తున్నారని వారు చెప్పారు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని విడుదల చేసిన సమరసింహారెడ్డి చిత్రాన్ని అభిమానులంతా చూసి థియేటర్ వద్ద హంగామా చేశారు. ఈ వేడుకల్లో ఛార్లెట్ లో ఉన్న పలువురు బాలయ్య అభిమానులు, టిడిపి అభిమానులు కూడా పాల్గొన్నారు.




































