Skip to main content

Namaste NRI

గోపీచంద్‌ పుట్టినరోజు సందర్భంగా.. సింగ టైటిల్‌ ఫస్ట్‌లుక్‌

గోపీచంద్‌ నటిస్తున్న ప్రతిష్టాత్మక యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సింగ. యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ వి.వెంకట్‌ దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని 70ఎంఎం ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. గోపీచంద్‌ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్‌తోపాటు గోపీచంద్‌ ఫస్ట్‌లుక్‌ని కూడా మేకర్స్‌ విడుదల చేశారు. పక్షుల కిలకిల రావాలతో మొదలయ్యే ఈ టైటిల్‌ గ్లింప్స్‌ ప్రేక్షకుల్ని దట్టమైన అడవిలోకి తీసుకెళ్తుంది. ట్రైబల్‌ నేపథ్య సంగీతం సినిమాపై ఆసక్తి పెంచుతుంది.

అడవిలో సంచరించే పాంథర్‌ని తలపించేలా చీకటిలో మెరుస్తున్న రెండు కళ్లు. అందరినీ సర్‌ప్రైజ్‌ చేస్తూ అవి గోపీచంద్‌ కళ్లుగా రివీల్‌ చేయడం బావుంది. చేతిలో గొడ్డలితో ప్రతీకారంతో రగిలిపోతున్న పాంథర్‌లా గోపీచంద్‌ కనిపిస్తున్నారు. ఆయనపై సింగ టైటిల్‌ రివీల్‌ అయింది. గుబురు గడ్డం మీసాలు, చెవికి పోగు, ఒంటినిండా రక్తం, చమటతో రగ్గడ్‌గా పవర్‌ఫుల్‌ అవతారంలో కనిపిస్తున్న గోపీచంద్‌ని ఈ గ్లింప్స్‌లో చూడొచ్చు. యాక్షన్‌, ఎమోషన్స్‌తో కూడిన పవర్‌ఫుల్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో మలయాళ నటి అనార్కలి నజర్‌ కథానాయికగా నటిస్తున్నది. ఈ చిత్రానికి కెమెరా: షామ్‌దత్‌, సంగీతం: సామ్‌ పీఎస్‌.

Social Share Spread Message

Latest News