Skip to main content

Namaste NRI

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఉంటుంది : సమంత

సమంత ప్రధాన పాత్రలో నటిస్తూ, రాజ్‌ నిడిమోరు, హిమాంక్‌ దువ్వూరుతో కలిసి నిర్మించిన యాక్షన్‌ ఫ్యామిలీ డ్రామా మా ఇంటి బంగారం. నందినీరెడ్డి దర్శకత్వం. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో సమంత మాట్లాడారు. మూడేళ్లయింది నేను సినిమాలు చేసి. అయినా మీ నుంచి అదే ప్రేమ. వెలకట్టలేని అభిమానం ఇది. మా ఇంటి బంగారంలో ప్రతీ ఎమోషన్ ఉంటుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఉంటుంది. యాక్షన్, డ్రామా, కామెడీ అన్ని అంశాలుంటాయి. సినిమా చాలా బాగా వచ్చింది. నిర్మాతకు ఎంత స్ట్రెస్‌ ఉంటుందో ఈ సినిమా ద్వారా తెలిసింది. నిద్రను కూడా దూరం చేసుకొని అంతా ఈ సినిమాకు పనిచేశారు. వారివల్లే ఈ పాత్రను సమర్ధవంతంగా పోషించగలిగాను. టెక్నికల్‌గా అన్ని విధాలా సినిమా బావుంటుంది. ఇందులో అద్భుతమైన యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉంటాయి. పాటలు బావుంటాయి. కచ్చితంగా ఈ బంగారం అందరికీ నచ్చుతుంది అని అన్నారు.

డైరెక్టర్‌ నందినీరెడ్డి మాట్లాడుతూ నా లైఫ్‌లో ఇంతకష్టపడ్డ సినిమా లేదు. టీమ్‌ వల్లే ఇంత త్వరగా సినిమా చేయగలిగాను. ఈ నెల 19న థియేటర్లలో సమంత విశ్వరూపం చూస్తారు అని నమ్మకంగా చెప్పారు. ఈ చిత్రం ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ కార్యక్రమంలో సంగీత విధ్వాంసురాలు శోభారాజ్‌, డి.సురేశ్‌బాబు, రాజ్‌ నిడుమోరు, డీకే, దేవకట్టా, స్వప్నదత్‌, వై.రవిశంకర్‌, శ్రీముఖి, చిన్మయి, రాహుల్‌ రవీంద్రన్‌, శ్రీలక్ష్మిలతోపాటు చిత్రబృందమంతా పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events