Namaste NRI

రిస్క్ మూవీ నుంచి దేవుడు వరమందిస్తే సాంగ్ రిలీజ్

సందీప్‌ అశ్వ, సన్యా ఠాకూర్‌ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం రిస్క్‌. సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. జీకే మిరాకిల్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాని జూన్‌ 26న విడుదల చేయనున్నారు. ప్రచారంలో భాగంగా ఈ సినిమాలో దేవుడు వరమందిస్తే అంటూ సాగే మెలోడీయస్‌ సాంగ్‌ని ప్రముఖ దర్శకుడు నక్కిన త్రినాథరావు విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు ఘంటాడి కృష్ణ, హీరో సందీప్‌ అశ్వ, చిత్ర నిర్మాతలు రవి సురేశ్‌రెడ్డి, గుర్రం నర్సిములు, సహ నిర్మాత గడ్డం రవి కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రేమ, స్నేహం, ఎమోషన్స్‌, సస్పెన్స్‌ అంశాల మేళవింపుగా రూపొందిన ఈ చిత్రం యువతను ఆకట్టుకుంటుందని మేకర్స్‌ చెబుతున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events